![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 561 లో.....భాగ్యం, సుకన్యలు జగత్ కంత్రీలు అని తెలియక తిరుపతి వాళ్ల ఉచ్చులో పడ్డాడు. బావ దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నోడిని దొంగని చేసేశారు. ఇక సుక్కును బైక్ ఎక్కించుకుని JD చక్రవర్తి పాట పాడుకుంటూ మేఘాల్లో తేలుతుంటే ఎదురుగా వేదవతి వస్తుంది. కంగారులో బైక్ పడేస్తాడు. వేదవతి మాత్రం చీపురు తీసుకుని సుక్కును వాయించేసింది.. నా తమ్ముడినే గుప్పిట్లో పెట్టుకుంటావా అంటూ కొడుతుంది. తిరుపతి కవరింగ్ చేస్తాడు. సుక్కుకి 104 ఫీవర్, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నానని తిరుపతి అంటే వేదవతి అస్సలు నమ్మదు.
అమ్మ పుట్టినరోజు నాడు కూడా కథ నడిపావని చిన్నోడు చెప్పాడు.. నిప్పు లేనిదే పొగ రాదని తిట్టింది. అది నెరజాణ, భాగ్యం అక్క దగ్గర ట్రైనింగ్ తీసుకుంది.. అమాయకురాలు కాదని వార్నింగ్ ఇచ్చి తిరుపతిని తన బైక్ మీద ఎక్కించుకుని లాక్కెళ్లిపోతుంది వేదవతి. కోచింగ్ సెంటర్ దగ్గర ప్రేమ, ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక లవర్స్ గొడవ పడి కలిసిపోవడం చూసి తన తప్పు తెలుసుకుని ధీరజ్ కి కాల్ చేస్తుంది ప్రేమ. కానీ ధీరజ్ అప్పుడే ముగ్ధ అనే అమ్మాయితో స్కూటీ మీద క్లోజ్ గా వెళ్తుంటాడు. ప్రేమ వాళ్ళిద్దరిని చూసి లిఫ్ట్ అనగానే ధీరజ్ షాక్ అవుతాడు. ప్రేమ ఫైర్ అవుతుంది. నేను రాక్షసిని.. ఈ పానీపూరి మొహం దేవకన్యనా అంటూ ప్రేమ అంటుంది. నా కారు సర్వీసింగ్ కి ఇచ్చా అని ధీరజ్ అంటాడు. స్కూల్ పిల్లలు కూడా నమ్మరు అని ప్రేమ అంటుంది. మనసుకు తెలిసిపోతుంది, దాన్నే ప్రేమంటారు అని ముగ్ధ అనడంతో ప్రేమ ఇంకా రెచ్చిపతుంది. చివరికి ఇద్దరు నువ్వే పోరా అనుకుంటూ తిట్టుకుంటారు.
ఆఫీస్ లో సాగర్ ఫైల్స్ అంటే లంచం డబ్బులు అని కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే నర్మద వచ్చేస్తుంది. చేతిలో డబ్బు చూసి.. లంచగొండివా, నిన్ను చూస్తే అసహ్యమేస్తుందని తెగ తిట్టేస్తుంది నర్మద. సాగర్ వెంటనే మాట మార్చేస్తాడు. ఇది లంచం కాదు, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం సర్దుబాటు చేసిన డబ్బు అని ఫ్రెండ్ తో సైగ చేసి అవుననిపిస్తాడు సాగర్. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం, సిన్సియర్ గా డ్యూటీ చేయడం తప్ప నాకేం తెలీదని సాగర్ ఎమోషనల్ డైలాగ్ కొట్టేసరికి నర్మద కరిగిపోయి సారీ చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |